ఈ ఫొటోలో ఉన్న క్యూట్ బేబీ ఎవరో గుర్తుపట్టారా !?

 


ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు అయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అని మనకి తెలుసు. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న మన సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు తెగ ట్రెండ్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు జెనీలియా చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. జెనీలియా ‘నీ తోడు కావలి’ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైంది.


తెలుగు ప్రేక్షకుల హాసిని అంటే మొదటిగా గుర్తొచ్చేది జెనీలియా అనే చెప్పాలి. బొమ్మరిల్లు సినిమాతో బంపర్‌హిట్‌ అందుకున్న ఈ బ్యూటీ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వివాహం తర్వాత సినిమాలకు దూరమయినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండేది. భర్త రితేష్‌తో కలిసి పలు ఫన్నీ వీడియోలు మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే ట్యాగ్‌ లైన్‌ను దక్కించుకుంది ఈ జంట.


విజయవంతమైన ఎన్నో చిత్రాల్లో ఆమె నటించింది. ఇప్పుడు మళ్లీ తెలుగు తెరపై మెరవనుందా అంటే, అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. ఇటీవలే పలువురు దర్శకులు జెనీలియాని సంప్రదించారని సినీ పరిశ్రమలో తెగ పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె తెలుగు సినిమాలకి దూరమై చాలా రోజులే అయినా పరిశ్రమకి మాత్రం టచ్‌లోనే ఉంటుంది. పైగా తెలుగు చిత్ర సీమలో కథానాయికలకి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరికీ అవకాశాలు దక్కుతుంటాయి.

No comments

Powered by Blogger.
close