ఇంకో పెండ్లి చేసుకుని సుఖంగా ఉండు.! భర్తకు లెటర్​ రాసి వెళ్లిపోయిన భార్య…ఇంకో పెండ్లి చేసుకుని సుఖంగా ఉండమని ఓ గృహిణి లెటర్​ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. మల్కాజిగిరి పరిధి ఆర్​కే నగర్​లో ఉండే జాడె రాకేశ్,​ కవిత (36)లు 13ఏండ్ల కిందట లవ్​ మ్యారేజ్ ​చేసుకోగా వారికి పిల్లలు కలగట్లేదు. దీంతో కొన్నేండ్లుగా హాస్పటళ్లలో చూపించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు రాకేశ్​ తన మెడికల్​ షాప్​కి వెళ్లి రాత్రి 10:40కి ఇంటి రాగా తాళం వేసి ఉంది. భార్యకు ఎన్నిసార్లు ఫోన్​ చేసినా లిఫ్ట్ చేయలేదు. చుట్టుపక్కల వారిని అడగడంతో పాటు స్థానికంగా వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు.

కవిత ఫోన్​ అక్కడే ఉంది. ‘‘ ఇక నేను హాస్పిటల్​కి రాను, ఇంకో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు.! నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నా”. ఇది నా సొంత నిర్ణయం అంటూ భార్య లెటర్ రాసి టీవి పక్కన పెట్టిందిచదివాడు. వెంటనే రాకేశ్ ​మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్​ చేయగా మిస్సింగ్​ కేసు ఫైల్​ చేశామని ఎస్​ఐ హరి ప్రసాద్​ తెలిపారు.

No comments

Powered by Blogger.
close