వీళ్లు ఆట‌గాళ్లే, దేశానికి ఎన్నో మెడ‌ల్స్ తీసుకొచ్చిన వాళ్లే, కానీ ఇప్పుడు అడ్డామీద కూలీలుగా మారారు.!


 

ఒక్క ప‌త‌కం గెలిస్తే చాలు కోట్ల‌కు కోట్ల పారితోషికాలు స్పాన్స‌ర్ షిప్స్.! అదే స‌మ‌యంలో మ‌ట్టిలో మెరుస్తున్న మాణిక్యాల‌ను మాత్రం ప‌ట్టించుకోరు.! గ్లామ‌ర్ ఉన్న గేమ్ కే త‌ప్ప‌ ఇంకో గేమ్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌రు, ఇదిగో ఇక్క‌డున్న వారంద‌రూ ఒక్కో గేమ్ లో ఛాంపియ‌న్ ఇప్పుడు పూట‌గ‌డ‌వ‌డం కోసం కూలీలుగా మారిపోయారు.!

ఆషా రాయ్‌:

 • అప్పుడు: 100, 200 మీట‌ర్ల ప‌రుగు పందెంలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడ‌ల్స్ సాధించింది
 • ఇప్పుడు: కూర‌గాయ‌ల‌ను అమ్ముకుంటుంది. సీతా సాహు:
 • అప్పుడు: జాతీయ‌స్థాయి ప‌రుగు పందెంలో బ్రాంజ్‌ మెడ‌ల్ సాధించింది.
 • ఇప్పుడు: పానీపూరీ అమ్ముతోందిరష్మిత పాత్రా:
 • అప్పుడు: భార‌త మ‌హిళా ఫుట్ బాల్ టీమ్ స‌భ్యురాలు.
 • ఇప్పుడు: పాన్ డ‌బ్బా పెట్టుకుని పాన్‌ల‌ను విక్రయించి జీవ‌నం సాగిస్తోంది.భ‌ర‌త్ కుమార్:
 • అప్పుడు: పారాలంపిక్ స్విమ్మింగ్ లో ఇండియాకు 50 మెడ‌ల్స్ వ‌ర‌కు తెచ్చిపెట్టాడు.
 • ఇప్పుడు: కార్ల‌ను వాష్ చేస్తూ జీవిస్తున్నాడు.శాంతీ దేవి:
 • అప్పుడు:  క‌బ‌డ్డీ చాంపియ‌న్‌.
 • ఇప్పుడు:  కూర‌గాయ‌లు అమ్ముతూ పిల్ల‌ల్ని పోషిస్తోంది.

నిషా రాణీ ద‌త్తా:
 • అప్పుడు: ఆర్చ‌రీ చాంపియ‌న్‌.
 • ఇప్పుడు: రోజువారీ కూలీ.రాజ్ కుమార్ తివారీ:
 • అప్పుడు: వింట‌ర్ ఒలంపిక్స్‌లో పాల్గొని స్కేటింగ్‌లో భార‌త్‌కు గోల్డ్ మెడ‌ల్‌ను సాధించి పెట్టాడు.
 • ఇప్పుడు:  రోడ్డు మీద సీజ‌న‌ల్ వ‌స్తువులు అమ్ముకుంటున్నాడు.


శాంతి సౌంద‌రాజ‌న్‌:
 • అప్పుడు: 2006 ట్రాక్‌ఫీల్డ్ అథ్లెటిక్స్‌… 800 మీట‌ర్ల ప‌రుగుపందెంలో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించింది
 • ఇప్పుడు: రోజువారి కూలీ


నారి ముండు:
 • అప్పుడు: ఇండియన్ మ‌హిళా హాకీ టీమ్ త‌ర‌పున 19 మ్యాచ్‌లు ఆడింది.
 • ఇప్పుడు: వ్య‌వ‌సాయ కూలీగా ప‌నిచేస్తోంది.బిర్ బ‌హాదూర్‌:
 • అప్పుడు:  ప్ర‌ముఖ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌
 • ఇప్పుడు:  పానీపూరీ అమ్ముకుని జీవ‌నం సాగిస్తున్నాడు.


సంధ్యా రాణి సింఘా:
 • అప్పుడు: ఈమె ఫెన్సింగ్ చాంపియ‌న్‌. జాతీయ స్థాయి టోర్న‌మెంట్‌ల‌లో బ్రాంజ్ మెడ‌ల్స్ సాధించింది.
 • ఇప్పుడు: కుటుంబం కోసం ఏ ప‌ని దొరికితే ఆ ప‌ని చేస్తుంది.స‌ర్వాన్ సింగ్‌:
 • అప్పుడు: 1954 ఏషియ‌న్ గేమ్స్ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడ‌ల్ సాధించాడు.
 • ఇప్పుడు: ధీన‌స్థితిలో ఉన్నాడు.No comments

Powered by Blogger.
close