తెలంగాణ: గోదావరి నదిలో దూకిన మహిళ.! కాపాడిన పోలీసులు…

 


పెద్దపల్లి: ఆత్మహత్య చేసుకునే నిమిత్తం గోదావరి నదిలో దూకిన మహిళను పోలీసులు, అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ కార్యకర్తలు రక్షించారు. గోవావరిఖని పట్టణం సమీపంలోని గోదావరి బ్రిడ్జిపై ఆదివారం చోటుచేసుకున్న వివరాలిలా ఉన్నాయి. 8 ఎన్‌క్లేవ్‌కు చెందిన పున్నం మిధునా(33) కుటుంబ కలహాల కారణంగా గోదావరి నదిలోకి దూకింది. కాగా పెట్రోలింగ్‌లో ఉన్న జే.శ్రీనివాస్‌, అక్వా టూరిజం సభ్యులు గౌలిగూడ ప్రసన్న కుమార్‌, గందం వెంకటేశ్‌ బోటు సహాయంతో నీటిలో మునిగిపోతున్న మహిళను రక్షించారు. అనంతరం ఆమెను గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

No comments

Powered by Blogger.
close