ఈమె ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా !?

 


ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు అయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అని మనకి తెలుసు. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న మన సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు తెగ ట్రెండ్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు నయనతార యొక్క చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. నయనతార ‘లక్ష్మి’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యింది.


నయనతార, ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు అనే చెప్పొచ్చు. ఒక చిన్న హీరోయిన్ గా తన కెరీర్ని మొదలు పెట్టి అంచెలంచలుగా ఎదిగిగింది. యావత్ భారత దేశం అంతటా టాప్ హీరోయిన్ స్థాయిలో నిలిచింది. ప్రేక్షకులు మరియు అభిమానాలు అందరు కూడా నయనతారని ”లేడీ సూపర్ స్టార్” అని పిలుస్తుంటారు. అలనాటి మహానటి సావిత్రి గారి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూసే వాళ్ళు, కానీ ఇప్పుడు అందరు అలా నయనతార కోసం ఎదురు చూస్తున్నారు.

నయనతార ‘మనస్సినక్కరే’ అనే మలయాళం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకులు అందరిని ఆకర్షించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఆ తరువాత ఇంకా వరుస సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అయితే విక్టరీ వెంకటేష్ ‘లక్ష్మి’ సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులు అందరికి దెగ్గర అయ్యింది. తెలుగులోని మొదటి సినిమాతోనే తన అందంతో వేపరితమైన క్రేజ్ ని సంపాదించుకుంది.


ఇది ఇలా ఉంటె ప్రస్తుతం నయనతార ప్రస్తుతం తమిళనాట సూపర్ స్టార్ అయిన రజిని కాంత్ ‘అన్నాత్తే’ అనే సినిమాలో మళ్లీ జత కట్టనుంది. అదే విధంగా ‘నేత్రికాన్’ అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే ఇది వరకే విజయ్ సేతుపతితో కలిసి ‘నేను రౌడీనే’ అనే సినిమాలో తన నటనతో ప్రేక్షకులు మరియు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిస్తున్నా ‘కాతు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమాలో నటించబోతుంది. ఈ సినిమాలో సమంత అక్కినేని కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది.


ఇదంతా పక్కన పెడితే నయనతార అటు సినిమాల్లోను ఇటు సోషల్ మీడియాలోనూ తెగ బిజీగా ఉంటుంది. తన ఫోటోలను మరియు తన ప్రియుడు కలిసి దిగే ఫోటలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందున ఇస్తుంది ఈ అందాల భామ. ఆమె పెట్టె ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే నయనతార ‘వేలు నాచియర్’ యొక్క ఆత్మకథ సినిమాలో నటిస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. త్వరలోనే అధికార ప్రకటన కూడా చేస్తారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో నయనతార చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

No comments

Powered by Blogger.
close