నేను హాట్ ఏంట్రా నీ బొంద, అతడికి నటి హేమ వార్నింగ్..


 

నటి హేమ కూడా తాజాగా అభిమానులతో ముచ్చటించింది. తన ఫాలోయర్స్‌తో సరదాగా కాసేపు ముచ్చటిస్తూ తనకు నచ్చిన విషయాలను వాళ్లతో పంచుకుంది. అయితే ఈమె లైవ్‌లోకి వచ్చిన విషయం తెలిసి నెటిజన్లు కూడా ఈమెను బాగానే ఆట పట్టించారు. ముఖ్యంగా చాలా మంది ఐస్ చేయడానికి ప్రయత్నించారు. అందరికీ చాలా ఓపికగా ఆన్సర్స్ ఇచ్చింది హేమ కూడా. సాధారణంగా ఫైర్ బ్రాండ్ అయిన హేమ సోషల్ మీడియా లైవ్‌లో మాత్రం చాలా కూల్‌గా కనిపించింది. అయితే అంతా బాగానే ఉన్నా, ఒక్క నెటిజన్ మాత్రం కాస్త హద్దులు దాటేసాడు. ఓ అడుగు ముందుకేసి మీరు చాలా హాట్‌గా ఉన్నారు, ఈ వయసులో కూడా చాలా హాట్‌గా కనిపిస్తున్నారు అనేసాడు. దానికి కూడా ఈమె కూల్‌గానే రియాక్ట్ అయింది. ఆ మాటను కాంప్లిమెంట్‌గానే తీసుకున్న హేమ తాను అంత హాట్ ఏమి కానని సున్నితంగా చెప్పుకొచ్చింది.

తనను చూస్తే పిచ్చిదానిలా ఉన్నావంటారని అప్పుడప్పుడూ ఎవరైనా చిల్లర కూడా వేస్తుంటారని తెలిపింది. అలాంటిది నీకు అంత హాట్‌గా కనిపిస్తున్నానా అంటూ ఆన్సర్ ఇచ్చింది. అదే పాత హేమ అయితే మాత్రం నేను హాట్ ఎంట్రా నీ బొందా కళ్లేమైనా కాకులు ఎత్తుకెళ్లాయా అంటూ కాస్త నాటుగానే సమాధానం ఇచ్చేది. కాకపోతే ఇప్పుడు అంతా మారిపోయిన హేమ కాబట్టి చాలా కూల్‌గా వ్యవహారం తేలిపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమాలు ఎందుకు చేయడం లేదంటే ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించినట్లు చెప్పింది హేమ. ఆ సినిమాలు త్వరలోమీ విడుదలవుతాయని క్లారిటీ ఇచ్చింది.

No comments

Powered by Blogger.
close