తల్లీ నువ్వుకూడా కరోనా కాటుకు బలై పోయావా..?
ఆ ధీర యువతి గుండె ఆగిపోయింది. కరోనా కర్కస కోరలకు ఆమె బలి అయిపోయింది. ఒకవైపు ముక్కుకు ఆక్సీజన్ పెట్టినా, చేతికి సెలైన్ ఉన్నా, ఆస్పత్రి బెడ్ పైన పాటలు వింటూ ఆనందంగా కనిపించిన ఆ ధీర యువతిని చివరి నిమిషాల్లో కరోనా కాటేసింది. కరోనా వ్యాధి సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఆమె ధైర్యం దేశప్రజలను కదిలించింది. ఎంతోమంది రోగుల్లో స్ఫూర్తి నింపింది. కరోనాను ఆమె ఓడిస్తుందని, అందరూ భావించారు. అలాంటి ధీరవనిత కరోనా చేతుల్లో ఓడిపోయింది.
ఆమె గుండె ధైర్యం, మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం కరోనా ముందు సన్నగిల్లిపోయాయి. అయినా ఆమె ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ఎంతో మందికి ధైర్యం. ఆమె చనిపోయిందన్న వార్త తెలియడంతో సోషల్ మీడియాలో సంతాపాల సందేశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఆసుపత్రిలో పాటవింటూ పరవశిస్తున్న ఆమె వీడియో చూడండి..
Post a Comment