నటి స్నేహని ఇలా ఎప్పుడు మీరు చూసుండరు…వైరల్ అవుతున్న ఫోటోలు !!

 


దాదాపు 20 ఏళ్ళు పైగానే ఉత్తమ నటిగా ప్రశంసలు అందుకున్న స్నేహ తన 18 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. మలయాళలో ‘ఇంగనే ఓరు నీలపాక్షి’ మరియు తమిళంలో ‘ఎన్నవాలే’ అనే చిత్రాలలో స్నేహ కథానాయికగా అడుగుపెట్టింది. మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన తన మొదటి చిత్రంలో ఆమె నటనకు మంచి సమీక్షలు అందుకున్న స్నేహ, తరువాత తమిళంలో వరుస చిత్రాలలో నటించారు. అప్పటి నుండి నేటి వరకు ప్రముఖ హీరోయిన్‌గానే కొనసాగుతూ వచ్చింది.


అంతే కాకుండా హీరోయిన్‌గా మంచి మంచి విజయాలు సాధించిన స్నేహ ‘పుత్తుప్పెట్ట’, ‘ఆటోగ్రాఫ్’ వంటి అనేక సినిమాలలో మంచి పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని మరియు అభిమానుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. స్నేహ చాలా చిత్రాలలో కథానాయికగా నటించినప్పటికీ, “పుడుపేటై” అనే చిత్రంలో కృష్ణవేణి అనే పాత్ర ఇప్పటికి చిత్ర పరిశ్రమలో చీర స్థాయిగా నిలిచి పోయింది. ఆ పాత్రలో ఆమె చేసిన నటన ప్రేక్షకులు మరియు అభిమానులను ఆశ్చర్యపరిచింది.


కేవలం తమిళంలో మాత్రమే కాదు అటు తెలుగు మరియు మలయాళంలో కూడా ప్రముఖ నటిగా ఎదిగిపోయారు. ఈమె ప్రతి ఒక్క సన్నివేశాలలో తన అందమైన నవ్వు మరియు భావోద్వేగాలతో ప్రేక్షకులు అందరిని ఆకర్షింపచేసింది. కమల్ హాసన్‌ వంటి స్టార్ హీరోతో కూడా కలిసి నటించింది. అయితే ఆమెను “స్మైల్స్ రాణి” అని చాలా మంది ప్రశంసించేవారు. మొత్తం సోత్ ఇండియా సినిమాను ఆమె తన హిట్‌లతో ఒక్కసారిగా కదిలించేసారు. మనస్సును కరిగించే పాత్రలలో మరియు లైవ్లీ కామెడీలో వంటి వివిధ పాత్రలలో కూడా నటించారు.


ఇప్పటిదాకా మూడుసార్లు తమిళనాడు ప్రభుత్వం నుండి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. స్నేహ తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇది ఇలా ఉండగా “అచ్చముండు అచ్చముండు” అనే చిత్రంలో ప్రసన్నతో కలిసి నటించింది స్నేహ. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రసన్న మరియు స్నేహ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత రెండూ కుటుంబాల సమ్మతితో వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వాళ్ళిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు.బాబు పుట్టిన తరువాత కూడా, సినిమాల్లో నటించాలనే ఆసక్తిని వదులుకోకుండా సినిమాలలో నటించింది కూడా. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విలేఖరి ఆమెను మీరు ఎలాంటి పాత్రలలో నటించాలి అని అడగగా అప్పుడు స్నేహ ”మంచి సినిమా మంచి పాత్ర మరియు పాత్రకు ప్రాధ్యానత ఉంటె చేస్తాను” అంటూ పేర్కొంది. స్నేహ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఆక్టివ్ గా ఉంటుంది. ఆమె తన భర్తతో మరియు పిల్లలతో దిగే ఫోటోలు ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. స్నేహ పెట్టె ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

No comments

Powered by Blogger.
close