బీచ్లో అందాలు ఒలకపోస్తూ కుర్రకారుకి మతిపోగొడుతున్న గోవా బ్యూటీ ఇలియానా ..!

 


ఇలియానా తన నడుము ఒంపులు గురించి తెలుగు కుర్రాళ్లకు తెలియనివేమీ కావు. జగన సుంద‌రి, గోవాబ్యూటీ, న‌డుము మంజ‌రి వంటి చాలా పేర్లు ఇలియానాకు ఉన్నాయి. ఫిజిక్ అంటే ఇలియానాలా ఉండాలిరా అంటూ చాలా పేర్ల‌తో ఇల్లీబేబీని తన అభిమానులు పిలిచేవాళ్లు. తెలుగు ఇండస్ట్రీలో ఇలియానా అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ తెచ్చుకుంది అంటే దానికి కారణం ఆమే ఫిజిక్ అనే చెప్పాలి. అసలు ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ‌ అప్ప‌ట్లో తన న‌డుము సోయ‌గాల‌తో తీపి న‌ర‌కం చూపించేసింది.


ఆ మధ్య కొంత కలం ఈమే పూర్తిగా ట్రాక్ తప్పింది. ఆ సమయంలో ఇలియానాని చూసి తన అభిమానులు అయ్యోపాపం అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ యధావిధిగా తన పాత ఫిజిక్ లోకి మారిపోయింది ఈ గోవాబ్యూటీ. గతంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో బిజీగా ఉండి నటనకు దూరంగా మరియు పిజిక్‌పై కూడా ప‌ట్టు కోల్పోయి బ‌రువు పెరిగిపోయింది. మీరు అందరు మాస్ మహారాజ్ రవితేజ మరియు ఇలియానా జంటగా నటించిన ”అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ” సినిమా చూసినట్టు అయితే మీకు అర్ధం అవుతుంది ఎంత బరువు పెరిగిందా అని.

ఒకపుడు ఇల్లీబేబీని బూత‌ద్దం వేసి ఎంత వెతికినా కనిపించేది కాదు. తన బాయ్‌ప్రెండ్ తో బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రస్తుతం బరువు తగ్గిపోయి మళ్లీ గ్లామర్ లుక్‌లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ 2006లో రిలీజ్ అయిన “దేవదాసు” సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తరువాత వెంటనే ‘పోకిరి’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు జంటగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది.అలాగే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్, రానా వంటి స్టార్ డమ్ ఉన్న హీరోల సినిమాల్లో నటించి మిగతా హీరోయిన్లకు వణుకు పుట్టించింది. తరువాత ఇలియానా తన సొంత గడ్డపై రాణించాలని బాలీవుడ్ ఇండస్ట్రీలోకి చెక్కేసింది. బాలీవుడ్లో వ‌రుస సినిమాల్లో నటించింది కానీ ఈమేకు ఒరిగిందేమి లేదు. ఇలియానా నటించిన సినిమాలు హిట్ అయిన ఈమేకు మాత్రం అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ప్రస్తతం సినిమా అవకాశాలు లేకపోవటంతో మళ్లీ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది.


బీచ్లో అందాలు ఆరబోస్తూ ఆ ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా దిగిన ఫోటోలు కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో చూస్తుంటే తన అభిమానులకి కంటిపై కునుకు లేకుండా పోతుంది అంటే ఆ రేంజ్ లో ఉన్నాయి అనే చెప్పొచ్చు. ఈ ఫొటోలకి లైకులు మరియు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు తన అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి

1 comment:

Powered by Blogger.
close