షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు అమ్మాయిలు వీటిని గుర్తుపెట్టుకోండి..

 


/

అమ్మాయిలకు, మహిళలకు ఎంత స్వేచ్ఛ వస్తుందో.. అంతే ప్రమాదాలు ఎదురవుతున్నాయి. అమ్మాయిలకు రక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… వారిపై దాడులు ఆగడం లేదు. అంతేకాకుండా వారిని రకరకాలుగా కొందరు ఇబ్బందులు పెడుతున్నారు. ఇక షాపింగ్ మాల్లోనూ అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా పోయింది. డ్రెస్సింట్ ట్రయల్ రూముల్లో కొందరు సీక్రీట్ కెమెరాలు పెట్టి వీడియో తీస్తున్నారు. ఈ విషయం గురించి జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.ఆ మధ్య కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురైంది. గోవాలోని ఓ ఫాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడ తాను ట్రయల్ రూంకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడ రెడ్ బల్బ్ కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షాపింగ్ మాల్లో తనిఖీ చేయగా సీక్రెట్ కెమెరాలు గుర్తించారు. దీంతో షాపింగ్ మాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

కొందరు యజమానులకు తెలియకుండా ఇలాంటి ఏర్పాటు చేసి అమ్మాయిలను ఇబ్బందులు పెడుతున్నారు. డ్రెస్సింగ్ మార్చుకునేటప్పుడు వీడియో షూట్ చేసి ఆ తరువాత వారితో సంప్రదింపులు చేసి భయపెడుతున్నారు. ఇలాంటివి కొన్ని బయటకువ వచ్చినా.. పరువు పోతుందనే ఉద్దేశంతో కొందరు బయటకు చెప్పలేదు. అయితే షాపింగ్ మాల్ కు వెళ్లేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

No comments

Powered by Blogger.
close