వామ్మో..! నిత్యా మీనన్ ఇలా మారిందేంటి..?

 


అలా మొదలైంది’ సినిమాతో తెలుగు సినిమాలో మెరిసిన నిత్యా మీనన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. చిట్టి పొట్టి మాటలతో అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ ఈ సినిమా తరువాత చాలా అవకాశాలను దక్కించుకుంది. మలయాళ గడ్డకు చెందిన నిత్య ఈ మధ్య వెండితెరపై కనిపించడం లేదు. అయితే చాలా కాలం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ ఛాన్స్ అమ్మడుకు మాములుగా రాలేదు. దీని వెనుక పెద్ద తతంగమే నడిచిందట. ఇదిలా ఉండగా నిత్యామీనన్ కు చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది.
దాదాపు మూడేళ్ల తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్ ’ సినిమాతో దుమ్ము దులిపేశాడు. దీంతో వెంటనే మరో రెండు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు ’ సినిమా చేస్తున్న పవన్ ఆ తరువాత మలయాళం మూవీ ‘అయ్యప్పన్ కోశియన్’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కు జోడిగా ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో నిత్యామీనన్ కు ఛాన్ష్ దక్కింది.
నిత్యామీనన్ సినిమాల్లో కనిపించి చాలా కాలం అయింది. అయితే గ్యాప్ వచ్చినా ఒకేసారి స్టార్ హీరోతో నటించే అవకాశం రావడంతో అమ్మడు ఫుల్ ఖుషీలో ఉంది. ఇక సినిమాలో చేస్తూనే నిత్య సోషల్ మీడియాలో అందచందాలను ఆరబోస్తుంది. తాజాగా ఆమె రెడ్ డ్రెస్ లో కొత్తగా కనిపించింది. అప్పటికీ ఇప్పటికీ నిత్యమీనన్ అందంలో చాలా మార్పు వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

No comments

Powered by Blogger.
close