చికిత్స పొందుతూనే విధులు నిర్వహించిన ప్రభుత్వ డాక్టర్: హ్యట్సాప్ అంటూ ప్రశంసలు

 


డాక్టర్లను దేవునితో కొలుస్తారు. ఎందుకంటే పోయే ప్రాణాన్నితమ కష్టాన్నంతా ధారపోసి కాపాడుతారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఎదుటి వారి ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో పోరాడి ఎందరివో ప్రాణాలను కాపాడారు. లాక్డౌన్ తో ప్రపంచం మొత్తం ఇళ్లల్లో కూర్చుంటే డాక్టర్లు మాత్రం విధుల్లో మునిగారు. అలా ఓ వైద్యుడు తన ప్రాణాల గురించి పట్టించుకోకుండా ఇతరుల సేవ చేయడాన్ని చూసి సెల్యూట్ చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో ఆ న్యూస్ వైరల్ గా మారింది.


ఆంధ్రప్రదేశ్లోని తూర్పగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం రేఖపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సుందర్ అనే వైద్యుడు పనిచేస్తున్నాడు. ఇతరుల జబ్బులను నయం చేసే డాక్టర్లే పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడుతున్నారు. అలా ఈ డాక్టర్ కూడా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతను చాలా వీక్ నెస్ అయ్యాడు. దీంతో ఆయన పనిచేస్తున్న ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. సాధారణంగా కొందరు ప్రభుత్వ వైద్యులు ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటారు. కానీ ఈ వైద్యుడు అలా చేయలేదు.


అంతేకాకుండా ఓ చేతికి సెలైన్ ఎక్కించుకున్నాడు. సెలైన్ ఎక్కించుకున్నవారు విశ్రాంతి తీసుకుంటారు. అయినా రెస్ట్ తీసుకుండో ఎడమ చేతికి సెలైన్ ఎక్కించుకుంటూ.. కుడి చేత్తో పేషెంట్లకు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్నాడు. అయితే ఓ ప్రైవేట్ వైద్యుడు ఇలా చేస్తే డబ్బుల కోసమో.. ఇతర కారణాలో అని అనుకుంటారు. కానీ ఓ ప్రభుత్వ వైద్యుడు ఇలా సేవలందించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈ డాక్టర్ అందిస్తున్న సేవలను దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

No comments

Powered by Blogger.
close