Puneeth Rajkumar: తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‏ !!

 


శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈరోజు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం జిమ్‏ చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. పునీత్‏కు గుండెపోటు అని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి పలువురు సినీ ప్రముఖులు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎలా ఉందొ తెలుసుకున్నారు..అనంతరం అయన కుటుంబసభ్యులను పరామర్శించారు. పునీత్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు కూడా స్పందించారు.. పునీత్‏ను ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు అని… ఓ ప్రైవేట్ క్లినిక్‏లో ఆసుపత్రికి రాకముందే ఆయన చికిత్స తీసుకున్నారని తెలిపారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెప్పలేమని తెలిపారు. ఇక ఇంతలోనే జరగాల్సిన నష్టం జారిపోయింది. అభిమానులని శోకసంద్రం లో ముంచేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

మీరు కన్నడలో మంచి హీరో..సూపర్ స్టార్ అని తెలుసు...మీ గురించి అంతకు మించి నాకు తెలీదు..
కానీ ఈ రోజు తెలుసుకున్నాను..

22 అనాధశ్రమాలు..
32 గ్రామాలు దత్తత..
18 గోశాలలు..
వేలమందిని చదివిస్తున్నారని...
ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి బోజనం...
ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపే నిజమైన హీరో..
అందరూ హీరోలు కావాలని అనుకుంటారు
వాళ్ళు చేసే మంచి పనులు నిజమైన హీరోలుగా
ప్రజల మనస్సులో ఎప్పటికీ సజీవంగా ఉంటారు..
ఇలాంటి మనసున్న మహారాజుని కోల్పోవడం నిజంగా అందరికీ తీరని లోటు...కానీ మరీ ఇంత చిన్న వయసులో 46 ఏళ్లకే చనిపోవటం మాత్రం బాధాకరం సార్....
డబ్బు, హోదా, పలుకుబడి ఎన్ని ఉన్నా చావు అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం.. చావు వచ్చాకా తప్పించుకోలేము..
మనకి దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఉన్నంతలో సంతోషంగా బతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి...ప్రతి నిమిషం ఎంజాయ్ చేయండి..
పుట్టుకతో ఏమి తీసుకురాము.. వట్టి చేతులతో వస్తాం.. పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాం..
ఈ నిజాన్ని చాలా మంది గ్రహించలేక కూర్చొని తిన్నా, తరతరాలు బతకడానికి సరిపోయేంత ఉన్న కూడా ఇంకా ఇంకా సంపాదించాలి అనే అత్యాశతో కొంతమంది అవినీతి చెస్తే, మరి కొంతమది లేనిపోని దుర్మార్గపు పనులు అన్ని చేస్తుంటారు.. ఎందుకు అలాంటి డబ్బు?? చివరకు మీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నా, లక్షల కోట్లు ఉన్నా పోయే సమయం వచ్చింది అంటే ఎవరు ఆపలేరు..
Miss You Puneeth Rajkumar garu 🙏🙏🙏

ఇక ఇప్పటికే కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు కూడా మూసివేశారు.. అటు ఆసుపత్రి ఎదుట.. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

No comments

Powered by Blogger.
close